team india: టీమిండియా ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ 251 పరుగులు

  • 48.2 ఓవర్లతో 250 పరుగులు చేసిన టీమిండియా
  • 116 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
  • ఆసీస్ విజయలక్ష్యం 251 పరుగులు

నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పూర్తి 50 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 48.2 ఓవర్లో 250 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కోహ్లీ (116), విజయ్ శంకర్ (46) మినహా ఇతర బ్యాట్స్ మెన్లు ఎవరూ ఆశించిన మేరకు రాణించలేకపోయారు. ఇతర బ్యాట్స్ మెన్ లలో రోహిత్ శర్మ డకౌట్, ధావన్ 21, రాయుడు 18, జాధవ్ 11, ధోనీ డకౌట్, జడేజా 21, కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా 0 పరుగులు చేశారు. రెండు పరుగులతో షమీ నాటౌట్ గా నిలిచాడు.

ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4 వికెట్లు తీసి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను శాసించాడు. జంపా 2 వికెట్లు తీయగా, కౌల్టర్ నైల్, మ్యాక్స్ వెల్, లియోన్ లు చెరో వికెట్ తీశారు. నాగపూర్ పిచ్ పై పగుళ్లు ఎక్కువగా ఉండటంతో... పిచ్ బౌలింగ్ కు సహకరించే అవకాశం ఉందని మ్యాచ్ కు ముందు సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఓవర్లు గడిచే కొద్దీ స్పిన్ కు సహకరించవచ్చని ఆయన అంచనా వేశారు. మరి మన స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News