Tollywood: మెగాస్టార్ ఇంటికెళ్లిన శివాజీ రాజా ప్యానెల్ సభ్యులు.. ‘మా’ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి!

- ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు
- ముగియనున్న శివాజీరాజా పదవీకాలం
- ఇప్పటికే మెగాస్టార్ ను కలిసిన నరేష్
తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. ప్రస్తుతం మా అధక్షుడిగా ఉన్న శివాజీరాజా పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు శివాజీరాజా ప్యానెల్ ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకుంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ కు విజ్ఞప్తి చేసింది.
