Andhra Pradesh: లగడపాటితో స్పీకర్ కోడెల రహస్య భేటీ.. ఎన్నికల్లో పోటీపై సర్వే చేయించారని ప్రచారం!

  • గుంటూరు జిల్లాలో ఇరువురు నేతల సమావేశం
  • ఏకాంతంగా చర్చలు జరిపిన నేతలు
  • సత్తెనపల్లి లేదా నరసరావు పేట నుంచి కోడెల పోటీ

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. దీంతో రాజకీయ నేతలు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు నేతలు నియోజకవర్గాల్లో తమ పరిస్థితిపై ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు ఈరోజు 'ఆంధ్రా అక్టోపస్' లగడపాటి రాజగోపాల్ తో రహస్యంగా భేటీ అయ్యారు.

గుంటూరు టౌన్ లోని చుట్టుగంట సెంటర్‌లో ఉన్న హోండా షోరూమ్ లో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. దీంతో సత్తెనపల్లిలో పోటీపై లగడపాటి సర్వే చేశారా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి సత్తెనపల్లి లేదా నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు పోటీ చేస్తారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

Andhra Pradesh
Telugudesam
kodela
lagadapati
Congress
  • Loading...

More Telugu News