imran tahir: వన్డేలకు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్

  • వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్
  • తర్వాతి తరం స్పిన్నర్ల కోసమే ఈ నిర్ణయం
  • టీ20ల్లో కొనసాగనున్న తాహిర్

దక్షిణాఫ్రికా స్టార్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (40) కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2019 ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా తర్వాతి తరం స్పిన్నర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ప్రపంచకప్ తర్వాత టీ20ల్లో కొనసాగుతానని తెలిపాడు.

పాకిస్థాన్ లో పుట్టిపెరిగిన తాహిర్ దక్షిణాఫ్రికాలో సెటిల్ అయ్యాడు. 2011 ఫిబ్రవరి 24న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడిన ఆయన 156 వికెట్లు తీశాడు. 146 పరుగులు చేశాడు. 2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరపున వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు కూడా తాహిర్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు రెండు వన్డే ప్రపంచకప్ లు, రెండు టీ20 ప్రపంచకప్ లు ఆడాడు.

imran tahir
one day
odi
retirement
south africa
  • Loading...

More Telugu News