raghava: నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన అది: 'జబర్దస్త్' రాకెట్ రాఘవ

  • చార్మీకి నేను అభిమానిని 
  • 'జబర్దస్త్'కి ఆమె గెస్టుగా వచ్చారు
  • చార్మీ చేతుల మీదుగా చెక్ తీసుకున్నాను  

'జబర్దస్త్' వేదిక ద్వారా పాప్యులర్ అయిన నటుల్లో రాఘవ ఒకరు. అంతకుముందు ఆయన సీరియల్స్ చేసినా .. వేరే షోలు చేసినా 'జబర్దస్త్' మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన జీవితంలో తనకి చాలా ఆనందాన్ని కలిగించిన సంఘటన ఒకటుంది అంటూ చెప్పుకొచ్చాడు.

"నేను చార్మీకి అభిమానిని .. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమె అంటే నాకు ఇష్టం. ఒకసారి నేను ఆమెను ఇంటర్వ్యూ చేశాను. నటన పట్ల ఆమె అంకితభావం .. పంజాబీ అయినా తెలుగు చక్కగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాను. ఒకసారి ఆమె 'జబర్దస్త్' కార్యక్రమానికి గెస్టుగా వచ్చారు. ఆ ఎపిసోడ్ లో నేను విజేతగా నిలిస్తే .. ఆమె చేతులమీదుగా చెక్ ఇచ్చారు. అప్పుడు నా సంతోషం అంతా ఇంతా కాదు .. నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక తీపి జ్ఞాపం అది'అని అన్నాడు.

raghava
ali
  • Loading...

More Telugu News