Andhra Pradesh: టీడీపీ ప్రభుత్వంలో శిలాఫలకాలు కూడా తాత్కాలికమే.. ఫొటోను పోస్ట్ చేసిన కన్నా!

- టీడీపీ అంటే తాత్కాలిక అభివృద్ధి-శాశ్వత అవినీతి
- అసెంబ్లీ, రాజధాని, ప్రభుత్వం అంతా తాత్కాలికమే
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఏపీ బీజేపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం అంటే ‘తాత్కాలిక అభివృద్ధి-శాశ్వత అవినీతి’ అని దుయ్యబట్టారు. ఏపీలో అసెంబ్లీ, ప్రభుత్వం, రాజధాని, శిలాఫలకాలు.. ఇలా అన్నీ తాత్కాలికమేనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కన్నా ట్విట్టర్ లో టీడీపీపై తీవ్రంగా మండిపడ్డారు.
