trivikram srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించిన పవన్

  • త్రివిక్రమ్ ఉన్నత విద్యావంతుడు
  • న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేశాడు
  • యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా

సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మధ్య ఉన్న అనుబంధం ఎలాంటితో అందరికీ తెలిసిందే. మరెవరినీ ఇష్టపడనంతగా త్రివిక్రమ్ ను పవన్ అభిమానిస్తారు. తాజాగా నెల్లూరులో వైద్య విద్యార్థులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ అంటే ఓ సినిమా దర్శకుడిగానే అందరికీ తెలుసని... ఆయన ఒక అత్యున్నత విద్యావంతుడని చెప్పారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో త్రివిక్రమ్ ఎమ్మెస్సీ చేశారని... యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా అని తెలిపారు. సినిమా అనేది ఒక గొప్ప రంగమని... 24 క్రాఫ్టులపై అవగాహన ఉంటేనే చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించగలరని చెప్పారు. ఎంతో అనుభవం కూడా ఉండాలని చెప్పారు.

డాక్టర్లు కూడా హౌస్ సర్జన్ చేసిన తర్వాతే విధుల్లోకి వస్తారని పవన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయం తనకు వైద్య విద్యార్థుల హౌస్ సర్జన్ షిప్ లాంటిదని... 2019 ఎన్నికల్లో తాను సర్జరీ చేయబోతున్నానని, శస్త్ర చికిత్స మొదలు పెడదామని వ్యాఖ్యానించారు. రోగి వ్యాధిని నయం చేసినట్టుగానే... సమాజాన్ని కూడా రుగ్మతల నుంచి కాపాడాల్సిన బాద్యత డాక్టర్లపై ఉందని చెప్పారు.

trivikram srinivas
pawan kalyan
janasena
tollywood
  • Loading...

More Telugu News