Andhra Pradesh: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు.. ఇకపై ఎవరైనా డేటాను హైదరాబాద్ లో పెడతారా?: సీఎం చంద్రబాబు

  • అహంభావంతో కేసీఆర్ దుర్మార్గాలు చేస్తున్నారు
  • ఎవరికైనా డేటా అన్నది ఓ ఆస్తి లాంటిది
  • టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు వ్యాఖ్య

అహంభావంతో తెలంగాణ సీఎం కేసీఆర్, అసహనంతో వైసీపీ అధినేత జగన్ దుర్మార్గాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన డేటా అన్నది ఒక ఆస్తి అని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆస్తులకే రక్షణ లేదని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, బూత్ స్థాయి కన్వీనర్లతో ఈరోజు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం చేకూరుస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపైన ఎవరైనా తమ డేటాను హైదరాబాద్ లో పెడతారా? అని ప్రశ్నించారు. అహంకారంతో టీఆర్ఎస్ నేతలు తమకు సంబంధంలేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీకి మేలు చేసేందుకే టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Hyderabad
brand image
  • Loading...

More Telugu News