Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అందుకే ప్రశాంతంగా ఉంటుందట!
  • గోవాలో ఫైట్స్ చేస్తున్న రామ్
  • 'ఓటర్'తో వస్తున్న మంచు విష్ణు 
  • మూడు భాషల్లోకి చరణ్ సినిమా   

*  పాజిటివ్ ఆటిట్యూడ్ (సానుకూల దృక్పథం) వల్ల ఎన్నో లాభాలున్నాయంటోంది అందాలతార కాజల్. 'ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో చూడడం వల్ల మనసు ప్రశాంతంగా వుంటుంది. నెగటివ్ ఆలోచనలకు దూరంగా వుంటే ఒత్తిడి అన్నదే వుండదు. నేను ప్రతి విషయాన్ని ఇలా పాజిటివ్ గానే  చూస్తాను. అందుకే ప్రశాంతంగా, వివాదాలకు దూరంగా ఉండగలుగుతున్నాను' అని చెప్పింది కాజల్.
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా గోవాలో జరుగుతోంది. ప్రస్తుతం హీరో రామ్ పాల్గొనే కొన్ని రిస్కీ ఫైట్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
*  మంచు విష్ణు హీరోగా కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓటర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో సురభి కథానాయికగా నటించింది. త్వరలో జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.
*  రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన 'రంగస్థలం' చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోకి అనువదిస్తున్నారు.  

Kajal Agarwal
Ramcharan
Puri Jagannadh
vishnu
  • Loading...

More Telugu News