Chandrababu: చంద్రబాబుపై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-c3853cf60ced25b3bf01cb8c46a8f498b2bd07ac.jpg)
- టీడీపీ డేటాను దొంగిలించారంటూ కలకలం
- ఐటీ నిపుణుడు లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు
- చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఫిర్యాదు
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రజల డేటా చౌర్యం జరిగిందని తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఏపీ ప్రజల డేటా చౌర్యంపై ఇప్పటికే ఐటీ నిపుణుడు లోకేశ్వర్ రెడ్డి హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబరాబాద్ పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. అయితే డేటా చౌర్యం విషయంలో ఏపీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై చర్య తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు.