America: అమెరికాలోని అలబామాలో తుపాను బీభత్సం

  • ఆగ్నేయ అలబామాలో టోర్నడో తీవ్రత
  • చిన్నారులు సహా 22 మంది మృతి
  • రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది

అమెరికాలోని అలబామా రాష్ట్రం టోర్నడో తుపాను బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. ముఖ్యంగా ఆగ్నేయ అలబామాలో టోర్నడో తీవ్రత ఎక్కువగా ఉంది. వందల సంఖ్యలో చెట్లు నేలకూలిపోగా.. ఎన్నో ఇళ్లు ధ్వంసమవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. తుపాను తీవ్రతకు చిన్నారులు సహా 22 మంది మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేడు మరో టోర్నడో వచ్చే అవకాశముండటంతో ఫ్లోరిడా, దక్షిణ కరోలినా, జార్జియా ప్రాంతాల్లోనూ టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు.

America
Tornado
Cyclone Effect
Florida
south karolina
  • Loading...

More Telugu News