India: యుద్ధంలో ఓడిపోతే పాక్ ఎంతకైనా తెగిస్తుంది: పంజాబ్ సీఎం ఆందోళన

  • ఇప్పటికే అడుక్కుతింటోంది
  • యుద్ధం వస్తే అంతేసంగతులు
  • అమరీందర్ సింగ్ విమర్శలు

ఒకవేళ భారత్ తో సంప్రదాయ యుద్ధంలో పాకిస్థా న్ ఓటమిపాలైతే అణుదాడికి సైతం వెనుకాడదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. భారత్ తో యుద్ధం వస్తే ఎక్కువ రోజులు నిలవగలిగే శక్తి పాక్ కు లేదని స్పష్టం చేశారు. భారత్, పాక్ రెండూ అణ్వస్త్ర సహిత దేశాలే అయినా బారత్ మాత్రం అణుయుద్ధానికి దిగకపోవచ్చని, కానీ ఇస్లామాబాద్ నాయకత్వం మాత్రం దుస్సాహసానికి పాల్పడడం ఖాయమని అన్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఇతర ఇస్లామిక్ దేశాలు వేసే ముష్టితో బతుకుతోందని, యుద్ధం వస్తే పూర్తిగా దివాలా తీస్తుందని ఈ మాజీ సైనికుడు వ్యాఖ్యానించారు.

ఇక, సర్జికల్ స్ట్రయిక్స్ లో మృతుల సంఖ్యపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమరీందర్ ఈ విషయంపై కూడా స్పందించారు. "చచ్చిపోయింది ఒక్కరు కానీ 100 మంది కానీ భారత్ పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. తన జవాన్లను కానీ, పౌరులను కానీ చంపుతుంటే ఎవరినీ శిక్షించకుండా వదలదన్న విషయం ఈ దాడులతో అందరికీ తెలియజెప్పింది" అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News