Ravali: వరంగల్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి

  • ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో పగ
  • నడి రోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అన్వేష్
  • హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రవళి మృతి

వారం రోజుల క్రితం వరంగల్‌లో రవళి అనే యువతిపై అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి నేడు చికిత్స పొందుతూ మృతి చెందింది. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో రవళిపై పగ పెంచుకున్న అన్వేష్.. ఆమె కాలేజీ నుంచి స్నేహితురాలి హాస్టల్‌కి వెళుతుండగా నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తొలుత ఆమెకు వరంగల్‌లో చికిత్స అందించిన వైద్యులు.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. వారం రోజులుగా రవళి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచింది. 

Ravali
Anvesh
Hyderabad
Warangal
Petrol Attack
  • Loading...

More Telugu News