Nara Lokesh: వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్.. కోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదు: లోకేశ్

  • బలమైన కార్యకర్తలున్న పార్టీ మాది
  • టీడీపీ సభ్యత్వం డేటా దొంగిలించారు
  • అమెరికాలో పర్సు పోతే హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తారా?

ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ధి రాలేదంటూ మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ఆయన రెండు వరుస ట్వీట్లలో కేసీఆర్, జగన్‌లు ఒక్కటయ్యారంటూ విరుచుకుపడ్డారు. ‘‘కేసీఆర్, జగన్‌ల జోడీ కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడింది. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైసీపీ నేతలు చదువుతున్నారు. వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్‌లో టీడీపీ సభ్యత్వం డేటా దొంగిలించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మాది’’ అని లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరో ట్వీట్‌లో.. ‘‘ఎన్ని సార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ధి రాలేదు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డేటా పోయింది అని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలి అని కూడా మీకు తెలియదా?’’ అంటూ నిలదీశారు.

Nara Lokesh
Twitter
Telugudesam Data
America
Hyderabad
Jagan
KCR
KTR
  • Loading...

More Telugu News