Ashok Babu: టీడీపీ కార్యకర్తల సమాచారాన్ని దొంగిలించేందుకే గ్రిడ్ సంస్థపై దాడులు: అశోక్ బాబు ధ్వజం

  • ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది
  • గవర్నర్ దృష్టికి తీసుకెళతాం
  • వైసీపీకి సాయం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు

ఏపీలో వైసీపీ తరుపున కేటీఆర్ ప్రచారం చేసినా ఎవరూ అడ్డుకోరని, టీడీపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు విశ్వసించరని.. ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రిడ్ సంస్థపై దాడులు.. టీడీపీ కార్యకర్తల సమాచారాన్ని దొంగిలించేందుకేనని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామన్నారు.

టీడీపీ కార్యకర్తలు యాప్‌లో తమ ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసుకున్నారని.. వాటి ఆధారంగా ఓట్లు తొలగించే కుట్ర హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి దాడుల కారణంగా హైదరాబాద్‌కు ఉన్న ఐటీ బ్రాండ్ ఇమేజ్ భవిష్యతులో నశించే అవకాశం ఉందని అశోక్ బాబు పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్. వైసీపీ ఏకమై ఓట్లు తీసేసే ప్లాన్‌ను రచించాయని అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి కేసీఆర్, కేటీఆర్ సాయం చేసుకోవాలంటే చేసుకోవచ్చని.. తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు.

Ashok Babu
YSRCP
KCR
KTR
BJP
Telugudesam Cadre
Grid
  • Loading...

More Telugu News