Siva NIrvana: యువకుడిగానూ.. మధ్య వయస్కుడిగానూ మెప్పించనున్న చైతు

  • శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’
  • శ్రావణి పాత్రలో నటిస్తున్న సమంత
  • రెండో కథానాయికగా నటిస్తున్న దివ్యాంక కౌశిక్

‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’. వీరిద్దరి వివాహం తరువాత చేస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్ రెండో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో చైతు గెటప్ ఆసక్తికరంగా ఉంటుందట. రెండు విభిన్న గెటప్‌లలో ఆకట్టుకుంటాడని తెలుస్తోంది.

యువకుడిగానూ.. ఆపై మధ్య వయస్కుడిగా చైతు చాలా ఆసక్తికర పాత్రలో కనిపిస్తాడని సమాచారం. చాలా విధేయత కలిగిన భార్యగా సమంత నటన ఆకట్టుకుంటుందని టాక్. సామ్.. శ్రావణి అనే గెటప్‌లో కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ఏప్రిల్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Siva NIrvana
Samantha
Naga chaitanya
Divyanka Koushik
Majili
Sravani
  • Loading...

More Telugu News