it grid: ‘ఐటీ గ్రిడ్’ కంపెనీకి కొత్త తలనొప్పి.. వైసీపీ నేత ఫిర్యాదుతో మరో కేసు నమోదు!
- హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పీఎస్ లో కేసు
- ఫిర్యాదు చేసిన వైసీపీ యూత్ వింగ్ నేత రాంరెడ్డి
- టీడీపీకి సాంకేతిక సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ
తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ‘ఐటీ గ్రిడ్’ కంపెనీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. మాదాపూర్ లో ఉన్న ఈ కంపెనీపై మరో కేసు నమోదయింది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ చోరీ చేసిందని వైసీపీ యూత్ వింగ్ నేత రాంరెడ్డి ఈరోజు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం ‘సేవా మిత్ర’ యాప్ ద్వారా ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు వైసీపీ నేత రాంరెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అంతకుముందు లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్ సంస్థపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. నలుగురు ఉద్యోగులను విచారణకు పిలిపించారు.