Andhra Pradesh: వరుసగా ఐదోరోజూ స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

  • లీటర్ డీజిల్ పై 13 పైసలు, పెట్రోల్ పై పైసా పెంపు
  • హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.76.58కు చేరిక
  • అమరావతిలో లీటర్ డీజిల్ ధర రూ.72.76 

భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. ముడిచమురు ధర పెరుగుదల, డాలర్ తో రూపాయి మారకం బలహీనపడటంతో వరుసగా ఐదో రోజూ ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ పై పైసా పెరగగా, లీటర్ డీజిల్ పై 13 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.17కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర రూ.67.54కు చేరింది.

ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.76.58కు, లీటర్ డీజిల్ రూ.73.44కు చేరాయి. అలాగే అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ76.32, లీటర్ డీజిల్ ధర రూ.72.76కు చేరుకున్నాయి.

Andhra Pradesh
Telangana
India
petrol
diesel rates
  • Loading...

More Telugu News