KTR: అడ్డంగా దొరికినా... రెడ్ హ్యాండెడ్ గా దొరికినా మిద్దెలెక్కి అరవడం చంద్రబాబు పని!: కేటీఆర్ ఫైర్

  • పక్క రాష్ట్రాలపైనే చంద్రబాబు కన్ను
  • బట్టేబాజ్ రాజకీయాలు వద్దు
  • మీడియాతో కేటీఆర్

గడచిన ఐదేళ్లుగా ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని, పక్క రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై మాత్రమే ఆయన తన దృష్టిని సారించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న వేళ, ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తనను ప్రశ్నించిన ఓ మీడియా సంస్థ ప్రతినిధిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

"ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని... పార్టీలకు అప్పనంగా అప్పజెప్పడం, అమ్ముకోవడం... ఇది మంచిదా? కాదా? ప్రజలు అనేటప్పుడు అందులో మీరు, నేను కూడా ఉంటాం. మర్చిపోవద్దు. మీకు ఒకవేళ ఆంధ్రాలో ఓటుంటే, ఆంధ్రాలో ఆధార్ కార్డుంటే, మీ బంధువులకు ఓటుంటే, వాళ్ల సమాచారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యాప్ లోకి ఎలా పోయింది, వాళ్ల అనుమతి లేకుండా? ఇలాగైతే ఎలా?" అని ప్రశ్నించారు.

"అడగండి దయచేసి. సేవామిత్ర అనే యాప్ కు ఎవరు ఇచ్చారు అధికారం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందా? ఎవరిచ్చారు? ముఖ్యమంత్రి ఇచ్చారా? దాన్ని క్వశ్చన్ చేస్తే ఆ వ్యక్తిపై దాడి చేస్తే... బట్టేబాజ్ పనులు చేయడం చంద్రబాబు మాత్రమే చేయగలిగిన పని. అడ్డంగా దొరికినా... రెడ్ హ్యాండెడ్ గా దొరికినా మిద్దెలెక్కి అరవడం ఆయన పని. మేం చేయగలిగిందేమీ లేదు" అని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News