Andhra Pradesh: ఏపీ అడ్వొకేట్ జనరల్, డీజీపీతో అత్యవసరంగా సమావేశమైన చంద్రబాబు!

  • ఐటీ గ్రిడ్ వ్యవహారంపై చర్చించిన ముఖ్యమంత్రి
  • న్యాయపరమైన సమస్యలపై ఇరువురితో సమీక్ష
  • టీడీపీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ

తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం ఏపీ, తెలంగాణ మధ్య చిలికిచిలికి గాలివానగా మారుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, డీజీపీ ఆర్పీ ఠాకూర్ తో ఈరోజు అత్యవసరంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్ కేసు, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంపై సమీక్ష నిర్వహించారు. నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులు కనిపించడం లేదని సహోద్యోగి తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం, పోలీసులు ఈరోజు నలుగురిని కోర్టు ముందు హాజరుపర్చడం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Andhra Pradesh
ag
dgp
Police
it grid
Chandrababu
Telugudesam
emeergency meeting
  • Loading...

More Telugu News