Varalakshmi Saratkumar: టైమొస్తే రాజకీయాల్లోకి: వరలక్ష్మీ శరత్ కుమార్!
- రాజకీయాలపై ఆసక్తిని పెంచుకుంటున్నా
- మహిళల ఆత్మరక్షణ స్వీయ కర్తవ్యమే
- ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాలే వేదికన్న వరలక్ష్మి
తానిప్పుడు రాజకీయాలపై ఆసక్తిని పెంచుకుంటున్నానని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేస్తానని చెబుతోంది దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి, ఆపై విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు నచ్చిన పాత్రను వదలకుండా చేసుకుంటూ, దూసుకెళుతున్న ఈ భామ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలే ఉన్నాయి.
'కన్నిరాశి; 'వెల్వట్ నగరం', 'నీయా 2', 'కాట్టేరి' తదితర తమిళ చిత్రాలతో పాటు తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్'లోనూ నటిస్తోంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె, రాజకీయాల్లోకి వస్తానని, అయితే అందుకు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పుకొచ్చింది. మహిళల ఆత్మరక్షణ స్వీయ కర్తవ్యమేనని, ఆత్మరక్షణ విద్యలను అమ్మాయిలు నేర్చుకోవాలని అభిప్రాయపడిన వరలక్ష్మి, ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాలే చక్కని వేదికని, అవేమీ చెడ్డ విషయాలు కాదని చెప్పింది. ప్రస్తుతానికి తన తండ్రి పార్టీకి, తనకు సంబంధాలు లేవని వ్యాఖ్యానించింది.