Manohar Parrikar: మరింత తీవ్రమైన మనోహర్ పారికర్ క్యాన్సర్!

  • క్లోమగ్రంధి క్యాన్సర్ తో బాధపడుతున్న పారికర్
  • వ్యాధి తగ్గే అవకాశాలు లేవన్న వైద్యులు 
  • చికిత్స పొందుతూనే సీఎంగా విధులు

రక్షణ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ కు క్యాన్సర్‌ వ్యాధి మరింత తీవ్రమైందని రాష్ట్ర మంత్రి విజై సర్దేశాయ్‌ వెల్లడించారు. క్లోమగ్రంధి క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, చికిత్స నిమిత్తం న్యూఢిల్లీ ఎయిమ్స్ తో పాటు అమెరికా కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో, ఆయన గోవాలోనే ఉండి చికిత్స పొందుతూనే సీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఆయన వ్యాధి మరింతగా ముదిరి, తీవ్ర దశకు చేరుకుందని సర్దేశాయ్ మీడియాకు వెల్లడించారు. పారికర్ ను కలిసివచ్చిన ఆయన, క్యాన్సర్ పై మరింత సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు.

Manohar Parrikar
Goa
Cancer
  • Loading...

More Telugu News