Ravindra Jadeja: బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

  • మోదీ తనకు స్ఫూర్తి అన్న రివాబా
  • బీజేపీలో చేరితే దేశం మొత్తం సేవ చేయొచ్చన్న క్రికెటర్ భార్య
  • గుజరాత్ మంత్రి ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో చేరిక

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతోపాటు కర్నిసేన మహిళా విభాగం అధ్యక్షురాలు కూడా బీజేపీలో చేరారు. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌సీ ఫల్దు, ఎంపీ పూనం సమక్షంలో వీరు కాషాయ కండువా కప్పుకున్నారు. రాజకీయాల్లో చేరి ప్రజాసేవ చేయాలని ఉందని రివాబా గత కొంతకాలంగా చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు స్ఫూర్తి అని, అందుకే తాను బీజేపీలో చేరినట్టు రవీబా జడేజా తెలిపారు. బీజేపీలో చేరడం ద్వారా దేశం మొత్తానికి సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు.

Ravindra Jadeja
Rivaba jadeja
BJP
Cricketer
Gujarat
  • Loading...

More Telugu News