jagga reddy: పార్టీలు మారేంత ఓపిక నాకు లేదు.. నన్నెవరూ కొనలేరు: జగ్గారెడ్డి

  • నా ప్రెస్ మీట్లు గందరగోళానికి గురి చేస్తున్న మాట నిజమే
  • దీని వెనుక ఒక పరమార్థం ఉంది
  • నన్ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు

తనకు ఎన్నో కష్టాలు ఉన్నాయని... అయినా తనను ఎవరూ కొనలేరని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీ మారే ఓపిక కూడా తనకు లేదని చెప్పారు. తన ప్రెస్ మీట్లు కొంచెం గందరగోళానికి గురి చేస్తున్న విషయం నిజమేనని... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. తన మాటల వెనుక ఒక పరమార్థం ఉందని... త్వరలోనే అదేమిటో తెలుస్తుందని చెప్పారు. సీఎల్పీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి ఈమేరకు వ్యాఖ్యానించారు.

షబ్బీర్ అలీ మాట్లాడుతూ, రంగులు మార్చే ఊసరవెల్లి కేసీఆర్ అని అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

jagga reddy
kcr
Shabbir Ali
congress
TRS
  • Loading...

More Telugu News