vijayashanthi: ఆ ఇద్దరినీ ఓటర్ల ముందు ఎండగట్టండి: విజయశాంతి

  • ఈవీఎంలను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ గెలిచింది
  • ఓటర్ల తీర్పును అవహేళన చేస్తోంది
  • స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరుతుండటంపై ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ... ఓటర్ల తీర్పును సైతం అవహేళన చేస్తోందని విమర్శించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలెం వేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ అకృత్యాలపై ప్రతిపక్షాలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ వేటు వేశారని... ఇప్పుడు విపక్షాల గుర్తుతో గెలిచి, టీఆర్ఎస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి, అక్కడి ఓటర్ల ముందు వారిని ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

vijayashanthi
congress
TRS
mlas
  • Loading...

More Telugu News