nagma: మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు నగ్మా గడుసు సమాధానం!

  • ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు జరుగుతుంది
  • అన్ని విషయాలు దేవుడు ముందే రాసి పెడతాడు
  • పెళ్లికి నేను వ్యతిరేకం కాదు

ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రసీమను నగ్మా ఓ ఊపు ఊపేసింది. బాలీవుడ్ లో సైతం సక్సెస్ ఫుల్ నటిగా కొనసాగింది. దాదాపు అగ్ర నటులందరితో నటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్రను పోషిస్తోంది. 45 ఏళ్ల వయసు వచ్చినా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.

తాజాగా మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అనే ప్రశ్న నగ్మాకు మీడియా నుంచి ఎదురైంది. దీనికి సమాధానంగా, 'పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎవరికైనా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెడతాడు. దాన్ని నేను డిసైడ్ చేయలేను' అని చెప్పింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని కూడా తెలిపింది.

nagma
tollywood
bollywood
congress
marriage
  • Loading...

More Telugu News