lalu prasad yadav: మోదీ, నితీష్ సభ తుస్సుమంది.. పాన్ షాప్ దగ్గర కూడా నాకు ఆమాత్రం జనాలు వస్తారు: లాలూ ఎద్దేవా

  • సభను విజయవంతం చేసేందుకు మోదీ, నితీష్ చాలా యత్నించారు
  • ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారు
  • ఇంత చేసినా సభకు జనాలు రాలేదు

పాట్నాలో ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి కలసి నిర్వహించిన ర్యాలీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు వేశారు. చాలా గొప్పగా సభను నిర్వహిస్తామని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని... చివరకు సభ జనాలు లేక తుస్సుమందని ఎద్దేవా చేశారు. రోడ్డు పక్కనున్న పాన్ షాప్ వద్ద కూడా తాను ఆమాత్రం జనాలను ఆకర్షించగలనని అన్నారు.

ఈ సభను జయప్రదం చేసేందుకు మోదీ, నితీష్ లు నెలల తరబడి పని చేశారని లాలూ చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారని... జనాలను తరలించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇంత చేసినా జనాలను ఆకర్షించడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. సభ నిర్వాహకులు తెలివిగా కెమెరా కదలికలను ఉపయోగించుకుని, ర్యాలీకి పెద్ద సంఖ్యలో జనం వచ్చినట్టు చూపించుకున్నారని అన్నారు. రియల్ ఫుటేజీ చూపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. 

lalu prasad yadav
modi
nitish kumar
patna
bjp
rjd
jdu
  • Loading...

More Telugu News