Andhra Pradesh: ‘ఐటీ గ్రిడ్’ వివాదం.. ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తో చంద్రబాబు అత్యవసర భేటీ!

  • న్యాయపరమైన మార్గాలపై చర్చ
  • లోకేశ్వర్ రెడ్డి ఇంటికెళ్లిన ఏపీ పోలీసులు
  • ఇంటి ముందే నిలువరించిన తెలంగాణ పోలీస్ అధికారులు

‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారం తెలుగురాష్ట్రాలను ఓ కుదుపు కుదుపుతోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయిందంటూ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.

ఈ కంపెనీ ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో అత్యవసరంగా భేటీ అయ్యారు.

ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ విషయంలో న్యాయపరంగా ఏ రకంగా ముందుకెళ్లాలన్న విషయమై వీరిద్దరూ చర్చించనున్నారు. మరోవైపు లోకేశ్వర్ రెడ్డిని విచారించేందుకు కూకట్ పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులను తెలంగాణ పోలీస్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అనంతరం లోకేశ్ రెడ్డిని అధికారులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Andhra Pradesh
Telangana
Police
it grid
dammalapati srinivas
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News