Chandrababu: గుంటూరు ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

  • గుంటూరు ఎంపీ టికెట్ గల్లా జయదేవ్ కే
  • పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ధూళిపాళ్ల నరేంద్రకు
  • తెనాలి నుంచి ఆలపాటి రాజా

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా ప్రకటిస్తున్నారు. తాజాగా ఈరోజు గుంటూరు పార్లమెంటు స్థానంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు... గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని ప్రకటించారు. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పేరును ఖరారు చేశారు. పొన్నూరు శాసనసభ స్థానం నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి నుంచి ఆలపాటి రాజా పేర్లను ప్రకటించారు. ఈ సాయంత్రానికి మరికొందరి పేర్లను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.

Chandrababu
guntur
mp
mla
ticket
galla jayadev
Dhulipala Narendra Kumar
alapati raja
Telugudesam
  • Loading...

More Telugu News