Murali Mohan: నేను, నా వాళ్లు ఎన్నికల బరిలో దిగడం లేదు: టీడీపీ ఎంపీ మురళీమోహన్

  • నేడు మీడియాతో మాట్లాడిన మురళీ మోహన్
  • 'మా' ట్రస్ట్ కే పరిమితమవుతాను
  • విషయాన్ని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పిన మురళీమోహన్!

తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ, వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని రాజమహేంద్రవరం ఎంపీ, టీడీపీ నేత మురళీ మోహన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఇకపై టీడీపీలో కార్యకర్తగా మాత్రం కొనసాగుతానని, 'మా' ట్రస్ట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటానని ఆయన అన్నారు.

కాగా, తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదని మురళీమోహన్ ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కాకినాడ, అమలాపురం ఎంపీలు సైతం టీడీపీ నుంచి బరిలో లేకపోవడంతో పలు నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు

Murali Mohan
Andhra Pradesh
Rajamahendravaram
Chandrababu
  • Loading...

More Telugu News