YSRCP: జగన్‌ మోహన్‌రెడ్డికే ఆ సత్తా ఉంది: రఘురామకృష్ణంరాజు

  • విభజన హామీల సాధన ఆయన వల్లే సాధ్యం
  • రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన సీఎం కావాలి
  • నేను వైఎస్‌ అభిమానిని...ఆ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం

విభజన హామీలు నెరవేరాలంటే అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డితోనే సాధ్యమని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పశ్చిమగోదారి జిల్లా టీడీపీ సీనియర్‌ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈరోజు ఆయన జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తటస్తులు అంతా జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తాను దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరెడ్డి అభిమానినని, వైఎస్సార్‌ కుటుంబంతో దీర్ఘకాలం నుంచి అనుబంధం ఉందని చెప్పారు.

YSRCP
raghuramakrishanamraju
West Godavari District
  • Loading...

More Telugu News