Andhra Pradesh: ఒకరిద్దరూ తప్ప మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్.. ఏపీ హోంమంత్రి చినరాజప్ప!

  • అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయి
  • కాకినాడలో బాలయోగి వర్ధంతి కార్యక్రమం
  • ఈ నెల 6లోగా అభ్యర్థులపై స్పష్టత వస్తుందన్న నేత

అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీడీపీని మరోసారి గెలిపిస్తాయని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీకి విజయాన్ని అందిస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అభ్యర్థులపై ఈ నెల 6లోగా స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు లోక్ సభ మాజీ స్పీకర్, టీడీపీ నేత బాలయోగి వర్ధంతి కార్యక్రమాన్ని కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి చినరాజప్పతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, రెండు స్థానాలు మినహా సీట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే దక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh
Telugudesam
East Godavari District
announcement
Nimmakayala Chinarajappa
  • Loading...

More Telugu News