sudirreddy: సుశిక్షితులైన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పార్టీని వీడరు: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

  • కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఎవరూ వెళ్లరు
  • ఎవరు వెళ్లిపోయినా నష్టం లేదు
  • మాపై తప్పుడు ప్రచారం

సుశిక్షితులైన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎవరూ పార్టీని వీడరని, ఎవరైనా వీడినా వందేళ్లకు పైగా చరిత్ర కలిగి కాంగ్రెస్‌ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను, సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతామని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పార్టీ మారడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండడం అంటే సుశిక్షితులైన సైనికుల్లా పనిచేయడం అని, ఈ విషయంలో మరే అంశానికి తావులేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి మరింతమంది టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని తాను అనుకోవడం లేదని అన్నారు.

sudirreddy
sabita indrareddy
TRS
Congress
  • Loading...

More Telugu News