Andhra Pradesh: 54 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారుగా.. ఢిల్లీకి వెళ్లి ఏం చేశారు?: వైసీపీ నేతలకు మంత్రి ఉమ సూటి ప్రశ్న

  • జగన్ కు ఓటు అడిగే హక్కే లేదు
  • ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను జగన్ విస్మరించారు
  • విజయవాడలో టీడీపీ నేత మీడియా సమావేశం

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కు ప్రజలను ఓటు హక్కు అడిగే హక్కే లేదని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతను మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడారు.

ఏపీలో 54 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని చెప్పిన వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏం చేశారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో వైసీపీ కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని మంత్రి ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Telangana
YSRCP
Jagan
uma
devineni
Telugudesam
  • Loading...

More Telugu News