Samantha: ఒకే వేదికపై తళుక్కుమన్న సమంత, కాజల్, రకుల్, తమన్నా!

  • 8న విడుదల కానున్న 'కెప్టెన్ మార్వెల్'
  • ప్రమోషన్ కార్యక్రమంలో హీరోయిన్లు
  • ఫోటోలు పోస్ట్ చేసిన సమంత

అందాల భామలంతా ఒకే చోట కలిస్తే... అందులోనూ వారంతా తెలుగు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసే హీరోయిన్లు అయితే... అదే జరిగింది. మార్చి 8న 'కెప్టెన్ మార్వెల్' కామిక్ చిత్రం విడుదల కానుండగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన కార్యక్రమంలో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్ పాల్గొన్నారు. నలుగురు హీరోయిన్లు ఒకే వేదికపైకి వస్తున్నారని తెలుసుకుని భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత, కామిక్ పాత్రలంటే తనకు చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టమని చెప్పింది. మిగతా హీరోయిన్ల ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.






Samantha
Kajal
Rakul
Tamannaah
Captain Marvel
  • Loading...

More Telugu News