Jagan: వైసీపీలోకి టీడీపీ నేత రఘురామ కృష్ణంరాజు.. జగన్ ఇంటికి!

  • పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రఘురామ కృష్ణంరాజు
  • టీడీపీలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని మనస్తాపం
  • రాజకీయ భవిష్యత్ పై జగన్ హామీ

కొంతకాలం క్రితం భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు, ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రఘురామ కృష్ణంరాజును స్వయంగా కారులో తీసుకువచ్చిన విజయసాయిరెడ్డి, ఆయన్ను జగన్ కు పరిచయం చేశారు. టీడీపీలో తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదన్న మనస్తాపంతో ఉన్న ఆయన, తన రాజకీయ భవిష్యత్ పై జగన్ ఇచ్చిన భరోసాతోనే వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్, రఘురామ కృష్ణంరాజుల మధ్య  జరిగిన చర్చల సారాంశంపై అధికారికంగా వివరాలు వెల్లడి కాలేదు.

Jagan
Raghurama Krishnamraju
West Godavari District
Hyderabad
  • Loading...

More Telugu News