Sahoo: అదరగొడుతున్న సాహో మేకింగ్ వీడియో... 'షేడ్స్ ఆఫ్ సాహో-2'

  • ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో'
  • నేడు హీరోయిన్ శ్రద్ధ పుట్టినరోజు
  • వీడియోను విడుదల చేసిన యూనిట్

'బాహుబలి' తరువాత ప్రభాస్, చేస్తున్న 'సాహో' చిత్రం మేకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. నేడు సినిమా హీరోయిన్, బాలీవుడ్ అందాల భామ శ్రద్ధా కపూర్‌ బర్త్ డే కాగా, ఈ సందర్భంగా సాహో షూటింగ్ విశేషాలతో 'షేడ్స్‌ ఆఫ్‌ సాహో 2' పేరిట చిత్ర యూనిట్ దీన్ని విడుదల చేసింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదల కానుంది.

ఇక ఈ తాజా వీడియోలో షూటింగ్ దృశ్యాలను, అత్యాధునిక వెపన్స్ ను, ఫైట్ సీన్లను చూపించారు. శ్రద్ధా కపూర్ ను సైతం ఫ్యాన్స్ కు పరిచయం చేశారు. ఈ సినిమా 'రన్‌ రాజా రన్‌' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, బాలీవుడ్‌ నటీ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Sahoo
Prabhas
Shraddha Kapoor
Birth Day
Making Video
  • Error fetching data: Network response was not ok

More Telugu News