Andhra Pradesh: రేపటి నుంచి బయటికెళ్లేటప్పుడు జర భద్రం.. పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు

  • మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 36 డిగ్రీలు నమోదు
  • శ్రీలంక నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి
  • కోస్తాలో నేడు పిడుగులు పడే అవకాశం

సోమవారం నుంచి ఎండలు ముదరనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడంతో శనివారం పగటి ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలు తగ్గినప్పటికీ సోమవారం నుంచి ఎండ వేడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు, నిజామాబాద్‌లో 34.9 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 36 డిగ్రీలుగా నమోదైంది.  

మరోవైపు కోస్తాలో భిన్నమైన వాతావరణం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల్లో నేడు పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

Andhra Pradesh
Telangana
Rains
temparature
Thunderbolts
  • Loading...

More Telugu News