maa: 'మా' అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన నరేష్

  • 'మా'లో ఎన్నికల హడావుడి
  • అధ్యక్షుడిగా ముగియనున్న శివాజీరాజా పదవీకాలం
  • సినీ పెద్దల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని తెలిపిన నరేష్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీరాజా పదవీకాలం ముగియడంతో ఆ పదవికి ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పదవి కోసం సీనియర్ నరేష్ నామినేషన్ వేశారు. మరోపక్క, శివాజీరాజా మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. రాజశేఖర్, జీవితలతో పాటు తన ప్యానల్ తో కలసి 'మా' కార్యాలయానికి వచ్చిన నరేష్ తొలుత దివంగత దాసరి నారాయణరావు విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కానందునే, సినీ పెద్దల కోరిక మేరకు పోటీ చేస్తున్నానని తెలిపారు. జీవిత మాట్లాడుతూ, గత సభ్యుల పని తీరును తప్పుబట్టారు.

maa
president
naresh
nomination
jeevitha
  • Loading...

More Telugu News