India: డీఆర్ డీఓ చైర్మన్ సతీష్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక 'మిస్సైల్ సిస్టమ్స్' అవార్డు

  • రాండెల్ విల్సన్ తో అవార్డును పంచుకోనున్న తెలుగుతేజం
  • క్షిపణి పరిజ్ఞానంలో దిట్ట
  • గతేడాది డీఆర్ డీఓ చీఫ్ గా బాధ్యతలు

మహోన్నత శాస్త్రవేత్త, భారత క్షిపణి కార్యక్రమ దిగ్గజం అబ్దుల్ కలాం వేసిన బాటలో ఇతర శాస్త్రవేత్తలు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తున్నారు. అందుకు నిదర్శనంగా డీఆర్ డీఓ చైర్మన్ జి.సతీష్ రెడ్డి ప్రతిష్ఠాత్మక అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ (ఏఐఏఏ) మిస్సైల్ సిస్టమ్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గాను సతీష్ రెడ్డి, ఆరిజోనాకు చెందిన మరో క్షిపణి శాస్త్రజ్ఞుడు రాండెల్ జే విల్సన్ తో సంయుక్తంగా అవార్డు అందుకోనున్నారు. వర్జీనియాకు చెందిన ప్రొఫెషనల్ సొసైటీ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సంస్థ ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపింది.

55 ఏళ్ల సతీష్ రెడ్డి గతేడాదే డీఆర్ డీఓ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. క్షిపణి వ్యవస్థల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అమర్చే విషయంలో సతీష్ రెడ్డి, రాండెల్ జే విల్సన్ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఏఐఏఏ సంస్థ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ) దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తున్న అనేక ఆయుధాలకు రూపకల్పన చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News