nirmala seetaraman: అభినందన్ ని కలిసిన నిర్మలా సీతారామన్

  • ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభినందన్
  • ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన రక్షణ మంత్రి
  • అభినందన్ ను ప్రశంసించిన నిర్మల

పాకిస్థాన్ నుంచి నిన్న రాత్రి వాఘా సరిహద్దు గుండా స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వింగ్ కమాండర్ అభినందన్ ను ఢిల్లీలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభినందన్ ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పరామర్శించారు. దేశం కోసం అంకితభావంతో పోరాడిన అభిని అభినందించారు. రక్షణ మంత్రి రాక సందర్భంగా యూనిఫామ్ ను ధరించి... ఆన్ డ్యూటీలో ఉన్న సైనికుడిలా అభి తయారు కావడం చిత్రంలో చూడవచ్చు.

nirmala seetaraman
abhinandan
airforce
  • Loading...

More Telugu News