Andhra Pradesh: టీడీపీ నేత కిశోర్ చంద్రదేవ్ కు ఇంటి సెగ.. తండ్రినే ఓడిస్తానంటున్న కుమార్తె శృతిదేవి!

  • అరకు నుంచి పోటీ చేస్తానన్న శృతిదేవి
  • ఇందుకోసం పార్టీకి దరఖాస్తు చేసినట్లు వెల్లడి
  • గత 18 ఏళ్లులో కాంగ్రెస్ కు సేవలందిస్తున్నట్లు వ్యాఖ్య

ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు ఇంటి సెగ తగిలింది. అరకు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పై చంద్రదేవ్ పోటీకి దిగితే, కాంగ్రెస్ తరఫున తాను పోటీ చేస్తానని ఆయన కుమార్తె శృతిదేవి ప్రకటించారు. ఆయనపై ఘనవిజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అరకు లోక్ సభ టికెట్ కోసం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేశానన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న శృతిదేవి మీడియాతో మాట్లాడారు. తాను గత 18 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నట్లు శృతిదేవి తెలిపారు.

టీడీపీ తీర్థం పుచ్చుకున్న కిశోర్ చంద్రదేవ్ కుటుంబం కురుపాం రాజవంశీకులు. చంద్రదేవ్ ఇప్పటివరకూ 5 సార్లు లోక్ సభకు, ఓసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో యూపీఏ ప్రభుత్వం రెండోసారి ఏర్పడ్డాక ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో  కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

  • Loading...

More Telugu News