jc diwakar reddy: 40 శాతం అభ్యర్థులను మార్చకపోతే టీడీపీ గట్టెక్కడం కష్టమే!: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

  • పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు 
  • చంద్రబాబు విషయంలో నాక్కూడా అభ్యంతరాలు ఉన్నాయి
  • సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇలాగే ఉంటే.. మోదీ మరోసారి పీఎం అవుతారు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో 40 శాతం మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోతే టీడీపీ గట్టెక్కడం కష్టమేనని చెప్పారు. చంద్రబాబు విషయంలో తనకు కూడా చిన్నచిన్న అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇలాగే ఉద్రిక్తంగా ఉంటే... నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో కూడా జేసీకి విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.

jc diwakar reddy
Chandrababu
modi
  • Loading...

More Telugu News