chandrababu: మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు

  • రాజానగరం అభ్యర్థి పెందుర్తి వెంకటేష్
  • రాజమండ్రి రూరల్ టికెట్ గోరంట్ల బుచ్చయ్యచౌదరికి
  • గోపాలపురం టికెట్ ముప్పిడి వెంకటేశ్వరరావుకు

రానున్న ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలువురు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ముగ్గురి పేర్లను ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న రాజానగరం, రాజమండ్రి రూరల్, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. రాజానగం టికెట్ ను పెందుర్తి వెంకటేష్ కు, రాజమండ్రి రూరల్ టికెట్ ను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, గోపాలపురం టికెట్ ను ముప్పిడి వెంకటేశ్వరరావుకు ప్రకటించారు. ఈ నియోజకవర్గాల నేతలో చర్చించిన తర్వాత చంద్రబాబు వీరి పేర్లను ఖరారు చేశారు. 

chandrababu
Telugudesam ticket
Gorantla Butchaiah Chowdary
pendurthi venkatesh
muppidi venkateswara rao
  • Loading...

More Telugu News