Andhra Pradesh: దేశానికి యువతే వెన్నెముక.. నిరుద్యోగ భృతిని నేటి నుంచి రెట్టింపు చేస్తున్నాం!: ఏపీ సీఎం చంద్రబాబు

  • యువత భవిష్యత్ కోసం ‘ముఖ్యమంత్రి యువనేస్తం పథకం’
  • భృతిని రెట్టింపు చేసి రూ.2 వేలు ఇవ్వబోతున్నాం
  • వింగ్ కమాండర్ అభినందన్ సాహసం స్ఫూర్తిదాయకం

దేశానికి యువతీయువకులే వెన్నెముక అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. యువత తమకు నచ్చిన రంగంలో రాణించి భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా తమ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ పథకం కింద అందిస్తున్న నిరుద్యోగ భృతిని నేటి నుంచి రెట్టింపు చేసి రూ.2,000 అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్విట్టర్ లో స్పందించారు.

అంతకుముందు భారత పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల కావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘దేశం కోసం పోరాడుతూ, శత్రు దళాలకు చిక్కి కూడా ఎంతో గంభీరంగా, నిబ్బరంగా పురుషోత్తముడిలా ధైర్యంగా నిలబడ్డ భారతీయ వాయుసేన కెప్టెన్ అభినందన్ సాహసం యువతకు స్ఫూర్తి దాయకం. ఆయన స్వదేశానికి క్షేమంగా చేరుకోవటం ఎంతో ఆనందంగా ఉంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News