Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి డ్రైవర్ వెకిలిచేష్టలు.. పోలీసులకు పట్టించి బుద్ధిచెప్పిన వివాహిత!

  • కృష్ణా జిల్లా విజయవాడలో ఘటన
  • వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

విధి నిర్వహణ సందర్భంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒకరు హద్దుమీరాడు. నిద్రపోతున్న మహిళా ప్రయాణికురాలిపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు ధైర్యంగా స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అన్నవరానికి చెందిన లక్ష్మీ శిరీష అనే వివాహిత  నిన్న రాత్రి విశాఖ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత ఆమె నిద్రిస్తుండగా బస్సులోని రెండో డ్రైవర్ గురుమూర్తి అక్కడకు చేరుకున్నాడు. అనంతరం ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో మేలుకున్న బాధితురాలు భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన సూచన మేరకు బెంజిసర్కిల్‌ వద్ద బస్సును ఆపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పడమటలంక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

Andhra Pradesh
apsrtc
harrasment
driver
Police
  • Loading...

More Telugu News