renu desai: జనసేనలో చేరికపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

  • నేను ఏ పార్టీలో చేరను
  • ఏ పార్టీకి మద్దతుగా లేను
  • జనాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు

జనసేన పార్టీలో చేరికపై సినీ నటి, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. జనసేనే కాదు, తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని ఆమె స్పష్టం చేశారు. జనసేనలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉంటే... అందులో సీక్రెట్ ఉండదని చెప్పారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా లేనని తెలిపారు. జనాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదనే విషయం అందరికీ తెలుసని చెప్పారు. రైతుల సమస్యలపైనే తాను ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించానని తెలిపారు. తాను హైదరాబాద్ వస్తూనే ఉంటానని... విజయవాడ, వైజాగ్ పర్యటనలు ముగిసిన తర్వాత హైదరాబాద్ వస్తానని చెప్పారు.

renu desai
janasena
join
tollywood
  • Loading...

More Telugu News