China: భారత్-పాక్‌లను అణ్వాయుధ దేశాలుగా గుర్తించ లేదు: చైనా

  • ఎన్ఎస్‌జీలో చేరకుండా భారత్‌ను అడ్డుకున్న చైనా
  • ఎన్‌పీటీపై సంతకం చేయలేదని కినుక
  • ఆశ్చర్యపోయే ప్రకటన చేసిన చైనా

భారత్-పాక్ మధ్య ఇటీవల వరుసగా సంభవిస్తున్న పరిణామాలతో దాయాదుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య అణుయుద్ధం తప్పదన్న వార్తలు కూడా వచ్చాయి. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం అణ్వాయుధాల గురించి ప్రస్తావించారు. పాక్ ఓ బాంబు వేస్తే భారత్ 20 బాంబులు వేస్తుందని హెచ్చరించారు. నిజానికి భారత్-పాక్‌లు రెండూ అణ్వస్త్ర దేశాలు కావడం వల్లే ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

 ఈ నేపథ్యంలో తాజాగా చైనా చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్-చైనాలను తామెప్పుడూ అణ్వస్త్ర దేశాలుగా గుర్తించలేదని శుక్రవారం తేల్చిచెప్పింది. భారత్-పాకిస్థాన్‌ల మాదిరిగా నార్త్ కొరియాను కూడా అణ్వస్త్ర దేశంగా గుర్తిస్తారా? అన్న ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ మాట్లాడుతూ.. భారత్, పాక్‌లను తామెప్పుడూ అణ్వస్త్ర దేశాలుగా గుర్తించలేదని తేల్చి చెప్పారు. కాగా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకం చేయని భారత్‌ను 48 దేశాల న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్‌జీ)లో చేరకుండా చైనా అడ్డుకుంటోంది.

  • Loading...

More Telugu News