Anantapur District: జేసీని సవాలు చేస్తూ మీసం మెలేసిన వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు

  • ప్రబోధానందనస్వామి ఆశ్రమం విషయంలో వివాదం
  • పోలీసులను కించపరిచినట్టు జేసీపై ఆరోపణలు
  • మీసం మెలేసి నాలుక కోస్తానని జేసీని హెచ్చరించిన మాధవ్

వైసీపీ నేత, మాజీ సీఐ గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదైంది. అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్న ప్రబోధానందస్వామి ఆశ్రమం వద్ద ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో పోలీసులను కించపరిచేలా జేసీ వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీంతో రంగంలోకి దిగిన అప్పటి సీఐ గోరంట్ల మాధవ్.. జేసీపై చెలరేగిపోయారు. మీసం మెలేస్తూ జేసీకి హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే నాలుక కోస్తానంటూ జేసీని హెచ్చరించారు.

మాధవ్ వ్యాఖ్యలపై జేసీ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఎంపీపై ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంటూ అతడిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కేసు నమోదు చేసేందుకు పోలీసులు తిరస్కరించడంతో జేసీ తాడిపత్రి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు మాధవ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.  

Anantapur District
Tadipatri
JC Diwakar reddy
Gorantla Madhav
YSRCP
  • Loading...

More Telugu News