India: పూర్తయిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ... వాఘా బోర్డర్ లో కాలుమోపిన అభినందన్

  • డాక్యుమెంటేషన్ పేరుతో కాలయాపన
  • ఎట్టకేలకు భారత భూభాగంలో అభినందన్
  • మరికాసేపట్లో అధికారిక ప్రకటన

పాకిస్థాన్ నక్కజిత్తుల వైఖరి గురించి తెలిసి కూడా అభినందన్ విడుదలపై భారతీయులు ఎంతగానో సంబరపడిపోయారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కల్లా విడుదల చేస్తామని ప్రకటించి రాత్రి ఆలస్యంగా అభినందన్ ను వాఘా సరిహద్దు వద్దకు పంపించింది పాక్. ఈ నేపథ్యంలో దాయాది వైఖరిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డాక్యుమెంటేషన్ పేరుతో మధ్యాహ్నం నుంచి పాక్ అధికారులు ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు రాత్రి 9.15 ప్రాంతంలో అభినందన్ ను వాఘా బోర్డర్ వద్దకు తీసుకువచ్చారు పాక్ అధికారులు.

అభినందన్ వాఘా చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నాడని, భారత గడ్డపై కాలుమోపాడని భారత మీడియాలో శుక్రవారం సాయంత్రం వార్తలు ప్రసారమయ్యాయి. కానీ, అందులో వాస్తవం లేదని కాసేపటికే తెలిసిపోయింది. అభినందన్ ఇంకా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తికాని కారణంగా లాహోర్ లోనే ఉన్నాడని తెలిసింది. అయితే లేటెస్ట్ గా అభినందన్ వాఘా చేరుకున్నట్టు విజువల్స్ ప్రసారం కావడంతో దేశ ప్రజల్లో సంతోషం అంబరాన్నంటుతోంది. మరికాసేపట్లో అభినందన్ ను భారత అధికారులకు అప్పగించే ప్రక్రియ పూర్తికానుంది.

  • Loading...

More Telugu News